జూన్ 4వ తేదీన వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి అందరు అసెంబ్లీ కో-ఆర్డినేటర్లతో మేం సమన్వయం చేస్తున్నాం, జిల్లా అధ్యక్షులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నాం, వారితో నిరంతరం టచ్ లో ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరితోనూ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం, మనం ముందుగా అనుకున్న ప్రకారం 4 వ తేది ఉదయం ర్యాలీలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తాం. మనం శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం, దానికి తగిన విధంగా స్పందించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. ఎక్కడైనా నిర్ధిష్టంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలోని లీగల్ సెల్‌ను సంప్రదించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa