ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన సాయి సుదర్శన్

sports |  Suryaa Desk  | Published : Thu, Jun 05, 2025, 12:07 AM

రెండున్నర నెలలుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించిన ఐపీఎల్ 2025 ఘనంగా ముగిసింది. ఈసారి కొత్త ఛాంపియన్ అవతరించింది. గత 18 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒడిసి పట్టింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఇక ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ సాధించిన ప్లేయర్‌గా గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ నిలిచాడు. ఈ మేరకు ముగింపు వేడుకల్లో అతడికి ఆరెంజ్ క్యాప్‌ను ఐపీఎల్ నిర్వహకులు అందజేశారు. ఈ టోర్నీలో అతడు 759 రన్స్ స్కోరు చేశాడు.


  ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్‌కు అవార్డుల పంట - పూర్తి విన్నర్స్ లిస్ట్ ఇదే


కోహ్లికి పటిదార్ గిఫ్ట్.. జీవితాంతం గుర్తుండిపోయేలా!


అక్కడికి వెళ్లొచ్చాక కోహ్లి లక్ మారింది.. విరాట్ చిరకాల కోరికలు నేరవేర్చిన బాబా..!


ఈసాలా కప్పు లాలీపప్పు కాదురా.. ఈసాలా అసలైన కప్పు.. ఇతర జట్లపై ఆర్సీబీ ఫ్యాన్స్ సెటైర్లు..!


ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరంటే..


*2008 - షాన్ మార్ష్ (పంజాబ్ కింగ్స్ - 616 రన్స్)


*2009 - మాథ్యూ హేడెన్ (చెన్నై సూపర్ కింగ్స్ - 572 పరుగులు)


*2010 - సచిన్ టెండూల్కర్ (ముంబై ఇండియన్స్ - 618 రన్స్)


*2011 - క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 608 పరుగులు)


*2012 - క్రిస్ గేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - 733 రన్స్)


*2013 - మైకెల్ హస్సీ (చెన్నై సూపర్ కింగ్స్ - 733 పరుగులు)


*2014 - రాబిన్ ఉతప్ప (కోల్‌కతా నైట్ రైడర్స్ - 660 రన్స్)


*2015 - డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ హైదరాబాద్ - 562 పరుగులు)


*2016 - విరాట్ కోహ్లీ (ఆర్సీబీ - 973 రన్స్)


*2017 - డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ హైదరాబాద్ - 641 రన్స్)


*2018 - కేన్ విలియమ్సన్ (సన్ రైజర్స్ హైదరాబాద్ - 735 పరుగులు)


*2019 - డేవిడ్ వార్నర్ (సన్ రైజర్స్ హైదరాబాద్ - 692 రన్స్)


*2020 - కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్ - 670 పరుగులు)


*2021 - రుతురాజ్ గైక్వాడ్ (సీఎస్కే - 635 రన్స్)


*2022 - జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్ - 863 పరుగులు)


*2023 - శుభ్‌మన్ గిల్ (గుజరాత్ టైటాన్స్ - 89 రన్స్)


*2024 - విరాట్ కోహ్లీ (ఆర్సీబీ - 741 పరుగులు)


*2025 - సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్- 759 రన్స్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa