ట్రెండింగ్
Epaper    English    தமிழ்

13న అనంతలో మెగా జాబ్ మేళా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 01:40 PM

జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ నెల 13న అనంతపురంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ జాబ్ మేళాను అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC), సీడాప్ (C-DAP) సంయుక్త ఆధ్వర్యంలో ఈ మేళా జరగనుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 50కి పైగా నేషనల్ మరియు మల్టీనేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యార్హతలకు అనుగుణంగా వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఈ మేళాలో లభించనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa