భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్, రెండు ప్రపంచ కప్‌ల గెలుపులో పాలుపంచుకున్న పీయూష్ చావ్లా (36) తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికాడు. అంతర్జాతీయ, దేశవాళీ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు."రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో గడిపిన తర్వాత, ఈ అద్భుతమైన ఆటకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. భారత జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నుంచి, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో సభ్యుడిగా ఉండటం వరకు, ఈ ప్రయాణంలోని ప్రతి క్షణం దేవుడి ఆశీర్వాదమే. ఈ జ్ఞాపకాలు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి" అని చావ్లా తన పోస్టులో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa