ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలిసారి మ‌హిళ‌కు అవ‌కాశం ఇచ్చిన జ‌న‌సేనాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2019, 12:46 AM

శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎలక్షన్ చరిత్రలో ఇప్పటి వరకు ఏపార్టీ కూడా ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ చరిత్రను తిరగరాయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు గర్వపడుతున్నాను. అన్నారు. శ్రీ‌కాళ‌హ‌స్తి జ‌న‌సేన అభ్య‌ర్ధిని నగరం వినుత  శ‌నివారం ఇంటింటి ప్ర‌చారంఆరంభిచి ఆమె  శ్రీ‌ కాళ‌హ‌స్తి నుంచి  నుండి గెలిచి మా నాయకుడి రుణం తీర్చుకుంటానన్నారు. ఈసార్వత్రిక ఎన్నికలను అవినీతి రహిత,ఎన్నికలుగా మార్చడమే ధ్యేయం అన్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎటువంటి ప్రలోభాలు లేకుండా నీతి వంతమైన రాజకీయం చేసి చూపుతామన్నారు.అదే విధంగా ఎవరైన ఓటర్లను ప్రలోభ పెట్టాలని చూసిన సహించేది లేదన్నారు. మానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఉపయోగపడే లబ్ది చేకూర్చే పథకాలను ప్రవేశ పెట్టడం జరిగింది.నేను రాజకీయ కుటుంబం నుండే వచ్చాను నేను పుట్టింది రేణిగుంట ఐన శ్రీకాళహస్తి గురించి పూర్తిగా తెలిసిన దానినే మామావయ్యా టిడిపిలో ఉన్నారు. మానాన్న వైకాపలో వున్నారు.అయిన వారువారి పార్టీలకు రాజీనామా చేసి జనసేన పార్టీలోకి రాబోతున్నారు. మాకుటుంబాన్ని ఆదరించిన ప్రజలు అదే విధంగా రాబోయే ఎలక్షన్ నను ఆదరించిన అత్యదిక మేజారిటీతో గెలిపించాలని కోరారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa