ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పుడు చెప్పే ఫుడ్స్‌లో కొన్ని తిన్నా క్యాన్సర్‌ని ఏరికోరి తెచ్చుకున్నట్టే

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 09:57 PM

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీనికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కొన్ని జన్యుపరంగా వస్తే మరికొన్ని మాత్రం మనకి తెలిసితెలియని తనంతో తెచ్చుకుంటున్నాం. కొన్ని క్యాన్సర్స్‌ని అయితే డబ్బు పెట్టి మరీ కొనుకుంటున్నట్లుగా చేస్తున్నాం. అవును, మనం తినే చాలా రకాల ఫుడ్స్ క్యాన్సర్స్‌కి కారకంగా మారుతున్నాయని చెబుతున్నారు హార్వార్డ్ ట్రైన్డ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సేథి. వీటిని వెంటనే మీ డైట్ నుంచి పక్కనపెట్టకపోతే క్యాన్సర్స్‌ని కొని ఇంట్లోకి తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు. ఈయన చెప్పిన చాలా ఫుడ్స్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటూనే ఉంటున్నాం. మరి వాటి గురించి తెలుసుకుని దూరం పెడితే చాలా రకాల క్యాన్సర్స్ నుంచి తప్పించుకోవచ్చు. అవేంటంటే తక్కువ టైమ్ లోనే 36 కిలోలు తగ్గిన యువకుడి ఫిట్ నెస్ స్టోరీ, అతను చెప్పిన టిప్స్ పాటిస్తే కొవ్వు కరిగి స్లిమ్ అవుతారు


ప్రాసెస్డ్ మీట్


ప్రాసెస్డ్ మీట్ అనేది చాలా ప్రమాదకరమైన ఫుడ్. ఆల్ట్రా ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రాసెస్డ్ మీట్‌ని ప్రాసెస్ చేస్తారు. ఇందులో నైట్రేట్, నైట్రైట్ వంటి ప్రిజర్వేటివ్స్ నైట్రోసో కాంపౌండ్స్ వంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయి. నైట్రేట్, నైట్రేట్ వంటి ప్రిజర్వేటివ్స్ నైట్రోసో కాంపౌండ్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి ప్రేగు క్యాన్సర్‌ ప్రమాదాన్ని పెంచుతాయి. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు, ఊబకాయం కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఇందులోని హై సోడియం, ప్రిజర్వేటివ్స్ కారణంగానే సమస్య వస్తుంది. కాబట్టి, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


షుగర్ డ్రింక్స్


షుగర్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా షుగర్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఈ డ్రింక్స్‌లో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటి కారణంగా అధిక బరువు పెరగుతారు. ఊబకాయం కారణంగా 13 రకాల క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్ వంటివి పెరుగుతాయి. కాబట్టి, షుగర్ డ్రింక్ష్ తీసుకోకపోవడమే మంచిది.


డీప్ ఫ్రైడ్ ఫుడ్స్


మనం తీసుకునే ఫుడ్స్‌ని డీప్ ఫ్రై చేసినప్పుడు అధిక టెంపరేచర్ దగ్గర స్టార్చ్ ఆధారిత ఆహార పదార్థాల నుండి యాక్రిలామైడ్ ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కారకంగా మారుతుంది. ఎక్కువ వేడి దగ్గర వండిన ఫుడ్‌కి AGEలను కలిగి ఉంటాయి. ఇవి మంట, ఆక్సీకరణ ఒత్తిడితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. అదే విధంగా, ఓ సారి ఫ్రై చేసిన నూనెని మళ్లీ మళ్లీ ఫ్రై చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. అధ్యయనాల ప్రకారం వేయించిన ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, డోనట్స్ కారణంగా ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వేయించిన ఫుడ్స్ తీసుకునేవారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుంది.


కాల్చిన మాంసం


జ్యూసీ స్టీక్, గ్రిల్‌పరై వేడిగా కాల్చిన రెడ్‌మీట్, గ్రిల్ చేసిన, పొగబెట్టిన మాంసాలు తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగేందుకు కారణమవుతుంది. హై టెంపరేచర్ వద్ద మాంసాన్ని గ్రిల్ చేయడం వల్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. మాంసానికి కాలిపోయిన రూపాన్ని, పొగ రుచిని ఇచ్చే గ్రిల్లింగ్, స్మోకింగ్ ప్రక్రియలు ఆహారంలో క్యాన్సర్‌ని కలిగించే కొన్ని సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. మీట్ కాలిపోయిన, నల్లబడిన ప్రాంతాల కారణంగా హెటోరోసైక్లిక్ ఆరోమాటిక్ అమైన్స్ విడుదలవుతాయి. అంతేకాకుండా పొగలో పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హఐడ్రోకార్బన్స్ మాంసంపై అతుక్కుంటాయి. ఇవన్నీ కూడా క్యాన్సర్ ప్రమాదంతో ముడిపడి ఉంటాయి.


క్యాన్సర్స్‌ని పెంచే ఫుడ్స్


​ఆల్కహాల్


ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తల, మెడ, రొమ్ము, కొలొరెక్టల్, అన్నవాహిక, కాలేయం, కడుపు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తాగితేనే కాదు, తక్కువ మొత్తంలో తాగినప్పటికీ ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఆల్కహాల్ వాడకం వల్ల నోరు, గొంతు, వాయిస్, అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే, ఆల్కహాల్ పొగాకులోని హానికరమైన రసాయనాలు, నోరు, గొంతు, అన్నవాహికను కప్పి ఉంచే కణాల్లోకి ప్రవేశించడానికి సాయపడుతుంది. పొగాకులోని రసాయనాల వల్ల ఈ కణాలు వాటి DNAకి కలిగే నష్టాన్ని ఎంతవరకు సరిచేయగలవో కూడా ఆల్కహాల్ పరిమితం చేయొచ్చు. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీంతో లివర్ దెబ్బతింటుంది. క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.


అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్


ఈ ఫుడ్‌లో ఎక్కువగా ఉప్పు ఉంటుంది. అధిక ఉప్పు కారణంగా శరీరంలో వాపు పెరుగుతుంది. ఇది T కణాల సంఖ్య పెరగడానికి కారణమవుతుది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ గట్ మైక్రోబయోమ్‌ వైవిధ్యాన్ని తగ్గిస్తాయి. హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలకి సాయం చేస్తాయి. వాపుని పెంచుతాయి. ఈ ఫుడ్స్ బాడీలో దీర్ఘకాలిక మంటని పెంచుతాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. అంతేకాదు, ఇందులోని అధిక కేలరీలు ఊబకాయానికి దారితీస్తాయి. గ్లూకోజ్ స్థాయిలను పెంచి షుగర్‌కి కారణమవుతుంది. దీని వల్ల కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa