మన బాడీలో ప్రతీ ఒక్క భాగం కూడా అందంగా కనిపించేలా చేసేందుకు టిప్స్ ఫాలో అవుతాం. కానీ, కొన్నిసార్లు మోచేతుల, మోకాళ్లని అంతగా పట్టించుకోం. దీంతో మురికి పేరుకుపోయి నల్లగా మారతాయి. ఈ సమస్యని దూరం చేసేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.
ఎంత రుద్దినా మోచేతులు, మోకాళ్లపై నలుపుదనం తగ్గట్లేదా, ఇప్పుడు చెప్పే 3 ప్యాక్స్ మోచేతులు, మోకాళ్ళని చర్మంలా మెరిసేలా చేస్తాయ్
నేటి కాలంలో ప్రతీ ఒక్కరూ కూడా అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చర్మాన్ని అందంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కొన్ని భాగాలను నిర్లక్ష్యం చేస్తారు. అందులో మోకాళ్లు, మోచేతులు. దీంతో స్కిన్ ఎంత బ్రైట్‌గా కనిపించినా మోచేతులు, మోకాళ్లు నల్లగా కనిపిస్తాయి. ఇలా కాకుండా ఆ భాగాలు కూడా చర్మంలా మెరిసిపోయేందుకు కొన్ని టిప్స్ హెల్ప్ చేస్తాయి.
అసలు మోచేతులు, మోకాళ్ల నల్లగా మారడానికి కారణం డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, ఎండకి గురికావడం, హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ కారణంగా సమస్య అలా మారుతుంది. అదే విధంగా, ఈ భాగంలో ఆయిల్ గ్లాండ్స్ ఉండవు. దీంతో ఎక్కువగా డ్రైగా మారి నల్లగా మారతాయి. దీనిని తగ్గించేందుకు 3 ఇంటి చిట్కాలు ఉన్నాయి.
పంచదార, ఆలివ్ ఆయిల్
ఇది మంచి హోమ్‌మేడ్ స్క్రబ్‌లా పనిచేస్తుంది. పంచదారలో ఆయిల్‌ని కలపడం వల్ల ఈ రెండు చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్‌ని రిమూవ్ చేసి స్కిన్‌ని హైడ్రేట్ చేస్తాయి. మంచి స్క్రబ్‌లా పనిచేసి స్కిన్ స్మూత్‌గా మారతుంది. అయితే, ఎక్కువగా రుద్దొద్దు. దీనిపై స్కిన్‌పై సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఏం చేయాలంటే
ఓ టేబుల్ స్పూన్ పంచదారలో అంతే పరిమాణంలో ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. దీనిని ఓ బౌల్‌లో వేసి బాగా కలపాలి.
దీనిని మోచేతులు, మోకాళ్లపై రాయాలి. తర్వాత మెల్లిగా 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా వారానికి ఓ సారి చేస్తే స్కిన్ సాఫ్ట్‌గా మారుతుంది.
అలోవెరా, మిల్క్
అలోవెరాలో మాయిశ్చరైజ్ గుణాలు ఉన్నాయి. ఇవి అన్ ఈవెన్ స్కిన్‌ని ఈవెన్‌గా చేస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అలోవెరా జెల్‌ని కొద్దిగా పాలతో కలిపి స్కిన్‌కి రాయడం వల్ల స్కిన్ సాఫ్ట్ అండ్ షైనీగా మారుతుంది. అయితే, వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
ఏం చేయాలంటే
ఓ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి.
అంతే పరిమాణంలో పాలు తీసుకోవాలి.
ఈ రెండింటిని ఓ బౌల్‌లో బాగా కలపాలి. దీనిని సమస్య ఉన్న చోట రాయాలి.
దీనిని రాత్రంతా అలానే ఉంచి మరుసటి రోజు ఉదయం క్లీన్ చేయాలి.
అయితే మనం నేచురల్ అలోవెరా జెల్ రాయడం మంచిది.
ఆపిల్ సైడర్ వెనిగర్, పెరుగు
ఆపిల్ సైడర్ వెనిగర్‌లో రిచ్ అసెటిక్ యాసిడ్ ఉంటుంది. అదే విధంగా పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. పెరుగు మన మోచేతులు, మోకాళ్లపై ఉన్న మురికిని దూరం చేసి గ్లోయింగ్‌గా చేస్తాయి. అయితే, దీనిని మరీ ఎక్కువగా రాయొద్దు. కొద్ది పరిమాణంలోనే రాయాలి.
దీనికోసం
1 టేబుల్ స్పూన్ పెరుగులో అంతే పరిమాణంలో ఆపిల్‌సైడర్ వెనిగర్ వేసి కలపాలి.
దీనిని బాగా మిక్స్ చేసి మోచేతులు, మోకాళ్లపై రాసి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
దీనిని వారానికి 4 సార్లు రాయండి.
మీరు ఆపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీరు వేసి కలిపి కాటన్ బాల్స్‌ని ఆ మిశ్రమంలో ముంచి మోచేతులు, మోకాళ్లకి రాసి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయొచ్చు.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే సమస్యని తగ్గించుకోవచ్చు.
గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి సమయం తెలుగు బాధ్యత వహించదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa