మూత్రంలో మంట రావడానికి కారణం మూత్రనాళ ఇన్ఫెక్షన్. ఈ సమస్య ఉన్నప్పుడు మాటిమాటికీ మూత్రం రావడం, మూత్రంలో మంట రావడం వంటి సమస్యలొస్తాయి. దీనిని నేచురల్‌గా తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్ తెలుసుకోండి.
మూత్రంలో మంటగా ఉంటూ ఎక్కువసార్లు మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తోందా, ఇప్పుడు చెప్పే డ్రింక్స్ తాగితే ప్రాబ్లమ్ సాల్వ్యూ రినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(UTI) దీనినే మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటారు. మూత్రవిసర్జన చేసినప్పటికీ మళ్లీ రెగ్యులర్‌గా మూత్ర విసర్జన చేయాలనిపించడం, మూత్రం రాకపోవడం, తక్కువగానే మూత్రం రావడం, మూత్రంలో మంట ఇవన్నీ కూడా మూత్రనాళ ఇన్ఫెక్షన్ లక్షణాలు. ఇలా అనిపించినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనిని వేడి చేయడం అని కూడా అంటారు. ఇది వేడి వాతావరణంలో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వృద్ధి చెంది సమస్య వస్తుంది. మూత్రంలో కోలి, ఇతర బ్యాక్టీరియా పెరిగినప్పుడు మూత్రాశయం, మూత్రనాళాన్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి. సమస్య ఉన్నప్పుడు మంట, దురదగా ఎక్కువగా ఉంటుంది. దీనిని పరిష్కరించేందుకు హాస్పిటల్ ట్రీట్‌మెంట్ బదులు కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చొని చెబుతున్నారు న్యూట్రిషనిస్ట్ శ్వేతాషా. వీటిని ఫాలో అవ్వడం మందులు వాడకుండానే మూత్రంలో మంటని తగ్గించొచ్చొని చెబుతున్నారు. అవేంటంటే
ధనియాల నీరు
కావాల్సిన పదార్థాలు
గుప్పెడు ధనియాలు
500 మి.లీ నీరు
తయారీ విధానం
ముందుగా నీటిని వేడి చేయాలి. అందులో ధనియాలని వేసి మరిగించాలి. నీరంతా సగం అయ్యేవరకూ మరిగించండి. దీనిని వడకట్టి రోజులో 3 సార్లు తాగండి. బెనిఫిట్స్
ఇలా ధనియాల నీరు తాగడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మూత్రంలో మంట చాలా వరకూ కంట్రోల్ అవుతుంది.
అలోవెరా, ఉసిరి
కావాల్సిన పదార్థాలు
అలోవెరా జ్యూస్ 10 నుంచి 15 మి.లీ.ఉసిరి రసం 10మి.లీదోసకాయ ముక్కలు అరకప్పు4 నుంచి 5 పుదీనా ఆకులు
తయారీ విధానం
చెప్పిన పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి జ్యూస్‌లా చేయాలి. దీనిని వడకట్టి తాగండి. దీని వల్ల మూత్రంలో మంట చాలా వరకూ తగ్గుతుంది. మూత్ర నాళ ఇన్ఫెక్షన్స్‌కి కూడా చెక్ పెట్టొచ్చు. రెగ్యులర్‌గా తాగితే మరిన్ని లాభాలు కూడా ఉంటాయి.
బార్లీ నీరు
కావాల్సిన పదార్థాలు
1 టేబుల్ స్పూన్ బార్లీ
2 కప్పుల నీరు
తయారీ విధానం
1 టేబుల్ స్పూన్ బార్లీని 2 కప్పుల నీటిలో వేసి బాగా మరిగించాలి. దీనిని వడకట్టి రోజంతా తాగుతుండాలి. దీని వల్ల కూడా చాలా వరకూ సమస్య తగ్గుతుంది. నీటి బదులు ఈ నీటిని కూడా తాగినా చాలా వరకూ సమస్య కంట్రోల్‌లోనే ఉంటుంది.
ఎండుద్రాక్ష, ప్రూన్స్
కావాల్సిన పదార్థాలు
4 నుంచి 5 ఎండుద్రాక్ష2 ప్రూన్స్
తయారీవిధానం
చెప్పిన పండ్లని ముందురోజు రాత్రి నానబెట్టాలి. దీనిని ఉదయాన్నే తినాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ మూత్రంలో మంటని తగ్గిస్తాయి.
వీటితో పాటు
ఈ చిట్కాలు ఫాలో అవ్వడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
నీరు ఎక్కువగా తాగాలి. డీహైడ్రేషన్ కారణంగానే సమస్య వస్తుంది. కాబట్టి, నీరు ఎక్కువగా తాగితే రెగ్యులర్‌గా మూత్రవిసర్జన జరిగి మూత్రనాళంలోని బ్యాక్టీరియా ఫ్లష్ అవుతుంది. ఈ కారణంగా సమస్య రాదు.
విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే యూటిఐ తగ్గుతుంది.
క్రాన్బెర్రీ జ్యూస్ తాగినా కూడా యూటిఐ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల హెల్దీ బ్యాక్టీరియా పెరుగుతుంది.
పెరుగు, మజ్జిగ, కెఫిర్ తీసుకోండి.
హైజీన్ అనేది చాలా ముఖ్యం. సంభోగం తర్వాత మూత్ర విసర్జన చేయడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే సమస్యలు చాలా వరకూ రావు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa