రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలతో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ మంజూరును ‘న్యాయ అధికారాన్ని వికృతంగా వినియోగించిన దురుద్దేశపు చర్య’గా అభివర్ణించింది. ఈ వారంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించడం ఇది రెండోసారి. హైకోర్టు తన పరిధిని సక్రమంగా వినియోగించకలేకపోయిందని పేర్కొంది. గతేడాది జూన్‌లో యూట్యూబర్ రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్‌తో పాటు అతడి ప్రియురాలు, నటి పవిత్రా గౌడ నిందితులుగా ఉన్నారు. ఆమెను వేధింపులకు గురిచేశాడనే ఆరోఫణలతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి చంపేశాడు.
ఈ కేసులో అరెస్టైన నటుడు దర్శన్ తూగదీప, నటి పవిత్రా గౌడలకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం (జులై 24) జస్టిస్ జే.బి. పార్దీవాలా, జస్టిస్ ఆర్. మాధవన్‌ల ధర్మాసనం విచారణ చేప్టింది. నిందితురాలు పవిత్ర గౌడ తరఫున లాయర్ వాదనలు వినిపిస్తుండగా.. ‘‘దోషిగా మేము నిర్దారించం కానీ... హైకోర్టు చేసిన తప్పు మేము చేయం’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘హైకోర్టు బెయిల్ ఉత్తర్వులు చదివితే దురుద్దేశంగా అనిపిస్తోంది కదా?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
హత్య కేసులో ‘అరెస్ట్ చేయడానికి కారణాలు పేర్కొనలేదు అనే వాదనలను హైకోర్టు ఎలా నమ్ముతుంది? ఇది అత్యంత బాధాకరం. హైకోర్టు ఇతర కేసుల్లో కూడా ఇలాగే ఉత్తర్వులు ఇస్తుందా?’ అని జస్టిస్ పార్దీవాలా ప్రశ్నించారు. ప్రాథమికంగా ఇది న్యాయ వ్యవస్థ అధికారాన్ని విచక్షణారహితంగా వినియోగించిందనడానికి ఉదాహరణ’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాదు, ‘ట్రయల్ కోర్టు జడ్జి పొరపాటు చేశాడంటే సరే అనుకోవచ్చు.. కానీ హైకోర్టు న్యాయమూర్తి అయితే ఎలా?’ అని విస్మయం వ్యక్తం చేసింది.
రేణుకాస్వామి ఈ సమాజానికి హానికరం.. కోర్టులో నటుడు దర్శన్ కీలక వ్యాఖ్యలు
కాగా, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్రా గౌడ మరో 12 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలోని దర్శన్, పవిత్ర గౌడ ప్రధాన నిందితులనే ఆరోపణలు ఇలా ఉన్నాయి: పవిత్ర గౌడకు రేణుకాస్వామి అభ్యంతర మెసేజ్‌లు పంపి, వేధించడాని దర్శన్ తన అనుచరులతో కలిసి అతడిని అపహరించి, హింసించి, హత్య చేయించాడు సుపారీ కోసం రూ. 50 లక్షలు ఇచ్చినట్టు పోలీసులు చెబుతున్నారు: కిడ్నాప్, హత్య, మృతదేహాన్ని పడేయడం కోసం ప్రదీప్ అలియాస్ పవన్‌కు రూ.30 లక్షలు, హత్యకు సహకరించిన నిఖిల్, కేశవమూర్తికి చెరో రూ. 5 లక్షలు, తన స్థానంలో జైలుకు వెళ్లడానికి కార్తీక్, రాఘవేంద్ర అనే ఇద్దరికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాడని గుర్తించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై బయటకు వచ్చిన దర్శన.. కోర్టు విచారణకు అనారోగ్యమని చెప్పి గైర్హాజరయ్యాడు. కానీ కొద్ది గంటల్లోనే సినిమా ప్రీమియర్‌లో కనిపించాడు. అలాగే, జైల్లో ఉండగా దర్హన్‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఫోటోలు వైరల్ కావడంతో మరో జైలుకు మార్చారు. ఈ కేసు రోజువారీ విచారణకు కర్ణాటక ప్రభుత్వం కోరడంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘‘పలువురు చాలా సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు... వారికెందుకు ఇదంతా జరగడం లేదు?’’ అని ప్రశ్నించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa