మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు మరియు మైనర్లపై జరుగుతున్న హింస, అదృశ్యాలు ఆందోళనకరంగా మారాయి. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం సమర్పించిన గణాంకాల ప్రకారం, మొత్తం 23,000 మందికి పైగా మహిళలు మరియు మైనర్లు గత కొన్ని నెలల్లో కనిపించకుండా పోయారని వెల్లడైంది. ఈ గణాంకాలు రాష్ట్రంలో మహిళా భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఇదే గణాంకాల ప్రకారం, మహిళలపై అత్యాచారం, వేధింపులు వంటి కేసులకు సంబంధించి సుమారు 1,500 మంది నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఈ విషయాలు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, బాధిత కుటుంబాలు పోలీసుల సహకారం లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఈ గణాంకాలను అసెంబ్లీలో సమర్పించిన తర్వాత, ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు చేస్తూ, మహిళల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని బాధితులను ట్రేస్ చేయాలని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa