బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ఓటర్ల జాబితా సవరణ రాజకీయ వేడి పెంచుతోంది. ఈ సవరణ ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విపక్షం గట్టిగా వ్యతిరేకిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశం ప్రధాన చర్చా అంశంగా మారింది.
విపక్ష INDIA కూటమి ఎంపీలు గత వారం రోజులుగా నిరసనలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. బుధవారం వరుసగా ఎనిమిదో రోజైనప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. ఈ అంశాన్ని సదనాల్లో ప్రస్తావించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు నినాదాలు చేశారు.
విపక్షం అభిప్రాయం ప్రకారం, ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా లేదని, అధికార పార్టీకి అనుకూలంగా మార్పులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఎన్నికల సంఘం మాత్రం ఈ రివిజన్ శాశ్వత ప్రక్రియలో భాగమేనని, అది నియమానుసారంగా జరుగుతోందని స్పష్టం చేసింది. అయినా రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa