ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 16న జరగనుంది. శాస్త్రం ప్రకారం, శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. 2025లో అష్టమి తిథి ఆగస్టు 15 రాత్రి 11:48కి మొదలై, సూర్యోదయ సమయానికి కొనసాగుతుంది. అందువల్ల సూర్యోదయ తిథి ప్రకారం ఆగస్టు 16న పండుగ జరుపుకుంటారు. అష్టమి తిథి, రోహిణి నక్షత్రం కలయిక ఒకే రోజు కాకపోయినా, ఉదయం తిథి ఆధారంగా పండుగను జరుపుకోవచ్చని పురోహితులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa