పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా ప్రపంచ వేదికల్లో భారత్ తమపై ‘ప్రతీకారం’ తీర్చుకోవాలని చూస్తోందని అజర్‌బైజాన్ సంచలన ఆరోపణలు చేసింది. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ)లో పూర్తిస్థాయి సభ్యత్వం కోసం తాము చేసిన ప్రయత్నాలను భారత్ అడ్డుకుందని ఆ దేశం ఆరోపణలు చేసిన మర్నాడే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అజర్‌బైజాన్ మీడియా కథనాల ప్రకారం.. తమ ఆకాంక్షను భారత్ అడ్డుకోవడం ద్వారా ‘పరస్పర దౌత్య సూత్రాలను’ ఉల్లంఘించిందని ఆరోపించింది. అలాగే, న్యూఢిల్లీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు బాకు ఇచ్చిన మద్దతే కారణమని పేర్కొంది.
కాగా, చైనాలోని తియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సమావేశానికి హాజరైన అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియోవ్.. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీష్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణలో పాక్ విజయం సాధించిందని పేర్కొంటూ ఇస్లామాబాద్‌ను అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తమపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. పాకిస్థాన్‌తో మా సన్నిహిత సంబంధాలు మాత్రం కొనసాగుతాయని అలియోవ్ స్పష్టం చేశారు. తమవి ఇస్లామాబాద్‌తో రాజకీయక, సాంస్కృతిక, వ్యూహాత్మక సంబంధాలని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్ధిక సహకారం విస్తరణ కోసం అజర్‌బైజాన్- పాకిస్థాన్ మధ్య ఇంటర్-గవర్నమెంటల్ కమిషన్ ఏర్పాటుపై కూడా షరీష్‌తో అలియోవ్ చర్చించారు.
కాగా, దీనికి ముందు అజర్‌బైజాన్ మీడియా.. మరోసారి షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ)లో పూర్తిస్థాయి సభ్యత్వం రాకుండా భారత్ మరోసారి అడ్డుకుందని పేర్కొంది. ‘అజర్‌బైజాన్ శాంతి ఎజెండాలో భాగంగా బాకును సమన్వయం చేసుకుంటూ అర్మేనియాతో దౌత్య సంబంధాలను పరిగణనలోకి తీసుకోవాలనే ఇటీవల పాక్ నిర్ణయింది. దీంతో షాంఘై సహకార సంస్థలో పూర్తి సభ్యత్వం కోసం అజర్‌బైజాన్ దరఖాస్తును భారత్ మరోసారి అడ్డుకుంది’ అని ఆరోపించింది. కాగా, ఇరుగుపొరుగు దేశాలైన అర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య కూాడా కొన్నేళ్లుగా ఘర్షణలు జరుగుతోన్న విషయం తెలిసిందే.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు అజర్‌బైజాన్ బహిరంగంగా మద్దతు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన బాకు.. ‘‘భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకున్న ఘర్షణలపై అజర్‌బైజాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది’’ అని పేర్కొంది. కాగా, ఇటీవల కొన్నేళ్లుగా పాకిస్థాన్- అజర్‌బైజాన్ మధ్య రక్షణ, వాణిజ్య, ప్రాంతీయ భద్రత సహాకారం గణనీయంగా పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa