ప్రకృతి వైపరీత్యాలతో తరచూ వార్తల్లో నిలిచే హిమాచల్‌ప్రదేశ్ ఇప్పుడు దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన నాలుగో రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం అక్షరాస్యత రేటు 99.3%కి చేరుకుంది. ఇది జాతీయ సగటు 95% కంటే ఎక్కువ. మిజోరం, గోవా, త్రిపుర తర్వాత హిమాచల్ ఈ జాబితాలో చేరింది. "7% నుంచి 99% వరకు ఈ ప్రయాణం సవాళ్లతో నిండింది. కానీ నాణ్యమైన విద్యతో ఇది సాధ్యమైంది" అని సీఎం సుఖ్వీందర్ సుఖు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa