తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డికి బుధవారం అలిపిరి పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో భూమనకు స్పష్టం చేశారు. అయితే కొద్ది రోజుల పాటు తాను బిజీగా ఉంటానని ఈ సందర్భంగా పోలీసులకు ఆయన స్పష్టం చేశారు. వీలు చూసుకుని రావాలంటూ భూమనకు ఎస్ఐ అజిత సూచించారు. వచ్చే మంగళవారం అంటే.. సెప్టెంబర్ 23వ తేదీన తాను ఈ విచారణకు హాజరవుతానని పోలీసులకు భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa