ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో ట్రంప్ భారీ స్వర్ణ విగ్రహం

international |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 03:32 PM

అమెరికాలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ క్యాపిటల్ భవనం వెలుపల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ స్వర్ణ విగ్రహం వెలవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. 12 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహంలో ట్రంప్ తన చేతిలో ఒక బిట్‌కాయిన్‌ను పట్టుకుని ఉన్నట్లు రూపొందించారు. ఈ విగ్రహాన్ని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు ఏర్పాటు చేసినట్లు ఏబీసీ అనుబంధ సంస్థ డబ్ల్యూజేఎల్‌ఏ వెల్లడించింది. డిజిటల్ కరెన్సీ భవిష్యత్తు, దేశ ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లలో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై విస్తృత చర్చను రేకెత్తించేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. క్రిప్టోకరెన్సీకి ట్రంప్ బహిరంగంగా మద్దతు పలికినందుకు గౌరవసూచకంగా కూడా దీనిని ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విగ్రహం ఏర్పాటుతో ఆ ప్రాంతంలో జనసందోహం నెలకొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa