హెచ్-1బీ వీసా ఫీజును డొనాల్డ్ ట్రంప్ లక్ష డాలర్లకు పెంపు ప్రకటనతో అమెరికాకు ఇండియా నుంచి వీసాదారులు ఆగమేఘాల మీద పరుగులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, భారత్ నుంచి వచ్చేవారిని అడ్డుకోడానికి ఉద్దేశపూర్వకంగానే విమాన బుకింగ్‌లను అడ్డుకునేందుకు జాత్యంహకారులు ప్రయత్నాలు చేశారు. కాగా, సెలవుల్లో గడిపేందుకు భారత్‌కు వచ్చిన అమృత తమనమ్ అనే స్టాఫ్‌వేర్ ఇంజినీర్.. ట్రంప్ ప్రకటనతో అమెరికాకు వెళ్తుండగా ఎదురైన అనుభవాన్ని పంచుకుని, ఆవేదనకు గురయ్యారు. రెసిస్ట్‌లు భారత్ నుంచి విమాన టికెట్ బుకింగ్‌లను అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ‘ క్లాగ్ ది టాయిలెట్ ’అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
వీసా ఫీజుపై ఆందోళనలు వ్యక్తం కావడంతో మొదటిసారి హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రమే లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షభవనం స్పష్టతనిచ్చింది. కానీ, అప్పటికే అమెరికాకు చెందిన పలు దిగ్గజ కంపెనీలు మాత్రం విదేశాల్లో ఉన్నవాళ్లంతా వెంటనే అమెరికాకు తిరిగి రావాలని తమ ఉద్యోగులకు సూచించాయి.
ఆస్టిన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోన్న అమృత తమనమ్ విజయవాడ నుంచి విమాన టిక్కెట్ బుకింగ్ కోసం ప్రయత్నించింది. ఇదే సమయంలో బోర్డ్ 4చాన్ యూజర్లు భారతీయ వీసాదారులు టికెట్లు బుక్ చేసుకోకుండా రిజర్వేషన్ వ్యవస్థలను స్తంభింపజేసే ప్రయత్నం చేశారు. ‘భారత్-అమెరికా విమానాలను గుర్తించి ‘చెక్‌అవుట్ ప్రాసెస్’ ప్రారంభించండి కానీ పూర్తి చేయవద్దు’ అని ఓ యూజర్ అన్నారు. ఇలా చేయడం ద్వారా బుక్తింగ్ వ్యవస్థ స్తంభించిపోయి వీసా హోల్డర్లు ట్రంప్ ప్రకటన అమల్లోకి రాముందు అమెరికాకు చేరకుండా అడ్డుకోవచ్చని వారు భావించారు. దీని ప్రభావం అమృత టిక్కెట్ బుకింగ్‌పై పడి.. విమానయాన సంస్థల వెబ్‌సైట్లు క్రాష్ అయ్యాయి. సాధారణంగా యూజర్లను కొన్ని నిమిషాల విండోను అనుమతించే చెక్అవుట్ పేజీ, చాలా వేగంగా ముగిసింది.
చాలాసార్లు ప్రయత్నించి అతికష్టంతో 2 వేల డాలర్లు చెల్లించి ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో డలాస్‌కు టికెట్ బుక్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విమానం టిక్కెట్ బుక్ చేసుకోవడం చాలా కష్టమైందని, భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చింది’ అని అన్నారు. టెలిగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలోనూ ట్రంప్ మద్దతుదారులు భారతీయ హెచ్1బీ వీసాదారులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ‘H1B ఫీజు పెంపు తర్వాత భారతీయులు మేల్కొంటున్నారు. వారిని భారతదేశంలోనే ఉంచాలనుకుంటున్నారా? విమాన రిజర్వేషన్ వ్యవస్థను బ్లాక్ చేయండి!’ అని పోస్ట్‌లు పెట్టగా.. దీనికి రిప్లయ్‌గా చాలా వరకు జాత్యహంకార దూషణలతో నిండిన పోస్ట్‌లనే పెట్టారు. విమానయాన వెబ్‌సైట్లు, బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై భారత్-అమెరికా రూట్‌లో సీట్లను హోల్డ్ చేయాలి, కానీ కొనుగోలు పూర్తిచేయవద్దని సూచించారు.
అధిక డిమాండ్ ఉన్న విమానాల్లో సీట్లు బ్లాక్ చేయడం ద్వారా టిక్కెట్ ధరలు పెంచేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఓ యూజర్ బ్రౌజర్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ‘నేను 100 సీట్లు లాక్ చేశాను’ అని పెడితే.. ‘‘ప్రస్తుతం ఢిల్లీ–నెవార్క్ విమానంలో చివరి సీటును బ్లాక్ చేస్తున్నాను’ అని మరో యూజర్ రాశాడు. ఎయిరిండియాలో సీట్లు బ్లాక్ చేసి, వెబ్‌సైట్‌ను నెమ్మదించేశామని కూడా కొందరు పోస్ట్ పెట్టారు. అయితే, ఎయిరిండియా ప్రతినిధి మాత్రం.. ఎటువంటి అంతరాయం జరగలేదని, బుకింగ్ వ్యవస్థలు సాధారణంగానే పనిచేశాయని తెలిపారు.
ఈ ప్రచారం ఎంతవరకు ప్రభావం చూపిందో తెలియనప్పటికీ, ఇది H-1B వీసా హోల్డర్లలో భయాందోళనలు రేపే ప్రయత్నమే అని, గ్లోబల్ ప్రాజెక్ట్ ఎగినెస్ట్ హేట్ అండ్ ఎక్స్‌ట్రీమిజం సహ- వ్యవస్థాపకురాలు హైడీ బెరిక్ చెప్పారు. ‘4చాన్‌లో నిజంగా భయంకరమైన విషయం ఏమిటంటే, అది వ్యక్తులను అతివాద నమ్మకాల వైపు ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉండటం’ అని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో నిందితులు తమ మ్యానిఫెస్టోలు ఈ సైట్‌లో ప్రచురించారని ఆమె గుర్తుచేశారు.
సమాచార యుద్ధ కాలంలో ఈ తరహా ఆపరేషన్‌లు కేవలం ‘కీబోర్డ్‌పై ఒక్క కీ నొక్కడం’ ద్వారా ఎంత విఘాతం సృష్టించగలరో చూపించిందని హేట్ అండ్ ఎక్స్‌ట్రీమిజం స్టడీ సెంటర్ వ్యవస్థాపకుడు బ్రయాన్ లెవిన్ పేర్కొన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా జాతీయవాద రాజకీయాలు బలపడుతున్న సమయంలో ప్రత్యర్థులపై దాడికి అంతర్జాతీయ అనధికారిక నెట్‌వర్క్, ఇంటర్నెట్ సహా విభిన్న సాధనాలను ఉపయోగిస్తున్నారు’ అని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa