ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిదండ్రులు చనిపోతే ఆశ్రయం ఇచ్చి,,,12 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన బాబాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 06:50 PM

విజయవాడ నగర శివారు పాయకాపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు చనిపోయి.. అనాథలా ఉన్న బాలికను పిన్ని, బాబాయ్ ఇంటికి తీసుకువచ్చి పెంచుకుంటున్నారు. అయితే బాలికపై కన్నేసిన బాబాయ్.. పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు ఆ బాలికను బెదిరించి.. రేప్ చేశాడు. గత కొన్ని రోజులుగా ఆ బాలిక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు.. బాలిక 3 నెలల గర్భంతో ఉన్నట్టు చెప్పడంతో ఆమె పిన్ని షాక్ అయింది. అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా.. పూర్తి విషయం బయటికి వచ్చింది. బాబాయ్ చేసిన దారుణాలను ఆ బాలిక అందరికీ వెల్లడించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న నున్న పోలీసులు.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆ బాలిక ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోందని పోలీసులు వెల్లడించారు.


6 ఏళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు ఒక రోడ్డు ప్రమాదంలో ఒకేసారి చనిపోవడంతో.. ఆమెను పిన్ని, బాబాయ్ ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ బాలిక వారి ఇంట్లో ఉండగా.. రాత్రి పూట అంతా నిద్రపోయిన తర్వాత.. బాలిక నోట్లో గుడ్డలు కుక్కి.. బాబాయ్ అత్యాచారానికి పాల్పడేవాడని ఆ బాలిక పోలీసులకు రాసిన ఫిర్యాదులో వెల్లడించింది. వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి.. అంతటి దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలు వాపోయింది. పోలీసులకు బాధితురాలు రాసిచ్చిన ఫిర్యాదులో ఉన్న అంశాలను చూస్తుంటే.. కన్నీరు తెప్పిస్తోంది.


పలుమార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించింది. ప్రస్తుతం ఆ బాలిక 3 నెలల గర్భవతి అని వైద్యులు గుర్తించారు. దీంతో ఆ బాలిక బాబాయ్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 64(2)(ఆర్), 65(1), సెక్షన్ 6 పోక్సో చట్టం కింద నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa