ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి.. క్షమాపణ లేఖ చదివిన నెతన్యాహు

international |  Suryaa Desk  | Published : Wed, Oct 01, 2025, 08:11 PM

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఒడిలో ఫోన్ పట్టుకోగా, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఖతార్‌పై దాడి చేసినందుకు ఫోన్ లో క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఖతార్‌లోని హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేయగా, ఒక ఖతార్ పౌరుడు మరణించాడు. ఈ నేపథ్యంలో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఐరాస సమావేశానికి వచ్చిన నెతన్యాహు, ట్రంప్‌ను కలిసి క్షమాపణ లేఖ చదివారు. ఖతార్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లు ఒప్పుకున్న నెతన్యాహు, మళ్లీ అలాంటి దాడి జరగదని హామీ ఇచ్చారు. వైట్ హౌస్ విడుదల చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa