విజయదశమి రోజు చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మవారికి పూజలు చేస్తారు. అమ్మవారికి విజయాన్ని తెచ్చిపెట్టిన ఆయుధాలను, మనిషి జీవన పోరాటంలో తన వృత్తికి ఉపయోగపడే ఆయుధాలన్నింటినీ దైవంగా భావించేటువంటి పర్వం విజయదశమి. అందుకే ఆ రోజున ఆయుధాలకు పూజ చేస్తారు. ఇక్కడ కేవలం మనకు ఉపయోగపడే వస్తువుల పట్ల మనకున్న గౌరవం, కృతజ్ఞతను దీంట్లో ఆవిష్కరించడమే కాకుండా, సర్వత్రా ఉన్న భగవత్ తత్వాన్ని గ్రహించాలనే గొప్ప సందేశం కూడా ఇమిడి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa