AP: మందుగుండు పేలి ముగ్గురు యువకులు గాయపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లా భీమిలి మండలం వలందపేటలో శనివారం చోటు చేసుకుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన అమ్మవారి నిమజ్జనోత్సవంలో బాణసంచా కోసం మందుగుండు సామగ్రిని తీసుకొచ్చారు. బాణాసంచా తయారు చేస్తుండగా మందుగుండు పేలింది. ఈ ఘటనలో మహేశ్, కనకరెడ్డి, వాసు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa