డిజిటల్ చెల్లింపుల రంగంలో భారతదేశం మరో అడుగు ముందుకు వేసింది. భారతీయ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇప్పుడు ఖతార్‌లో అందుబాటులోకి వచ్చింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దోహాలోని లులు మాల్‌లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, UPI భారతీయ ఆవిష్కరణ, సాంకేతికత శక్తికి చిహ్నమని తెలిపారు. భారతదేశంలో 85% డిజిటల్ చెల్లింపులు UPI ద్వారానే జరుగుతుండగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% డిజిటల్ చెల్లింపులు ఈ వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa