ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జుట్టు కోసం చెక్క దువ్వెనని వాడుతున్నారా, ఇలా చేయడం మరవకండి

Life style |  Suryaa Desk  | Published : Sat, Oct 11, 2025, 09:49 PM

ప్రతీఒక్కరూ ఈ మధ్యకాలంలో జుట్టుని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. హెయిర్ కేర్‌ విషయంలో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ వంటివి వాడకూడదనుకుంటూ చెక్క దువ్వెనల్ని కడా వాడుతున్నారు. దీనిని వాడడం వల్ల కలిగే లాభాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జుట్టుపై చాలా సున్నితంగా ఉంటుంది. జుట్టుకి సహజంగానే పోషణని అందిస్తుంది. తలపై హెల్దీగా రక్తప్రసరణని పెంచుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే హెయిర్ కేర్‌లో భాగంగా వాడే దువ్వెనని ఎప్పుడు క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలో కూడా తెలిసి ఉండాలి.


​హెయిర్ కేర్‌లో సరైన ప్రోడక్ట్స్ వాడితేనే హెల్దీ జుట్టుని పొందొచ్చు. అయితే, హెయిర్ కేర్ అనగానే చాలా మంది షాంపూ, ఆయిల్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు కానీ, దువ్వెనల గురించి అంతగా పట్టించుకోరు. కానీ, దువ్వెన వల్ల కూడా జుట్టుకి బెనిఫిట్స్ ఉన్నాయని గుర్తించాలి. అందుకోసం ఎలాంటి దువ్వెన వాడాలి, ఏ దువ్వెన వాడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, చెక్క దువ్వెనతో వచ్చే లాభాల గురించి తెలుసుకుని తీరాలి.


పెరిగిన అవగాహనతో చాలా మంది ప్లాస్టిక్ దువ్వెన బదులు, చెక్క దువ్వెనని వాడుతున్నారు. దీనికి కారణం తలపై, జుట్టుపై ఎక్కువ ప్రెజర్ ఉండదు. చుండ్రు, దురద తగ్గుతుంది. మురికి, దుమ్ము, ధూళిని దూరం చేస్తుంది. ఎక్కువ రోజులు చక్కగా పనిచేస్తాయి. వీటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటివి దూరమవుతాయి. చిక్కులు తేలిగ్గా తీయడానికి హెల్ప్ అవుతుంది. ప్లాస్టిక్‌కి దూరంగా కూడా ఉండొచ్చు. దీనిని ఇలా ఎన్నో కారణాలతో మనం ప్లాస్టిక్ దువ్వెన నుంచి చెక్క దువ్వెనకి షిఫ్ట్ అవుతున్నాం. అయితే, వీటిని వాడడం సంగతి సరే. క్లీనింగ్ సంగతి ఏంటి. ఎలా క్లీన్ చేస్తే చెక్క దువ్వెనలు చక్కగా క్లీన్ అయి అవి తిరిగి వాడడానికి సిద్ధంగా ఉంటాయో తెలుసుకోండి.


చెక్క దువ్వెనల్లో ఏది మంచిది?


చెక్క దువ్వెనలు మంచివి. దీనికి కారణంగా, స్టాటిక్‌ని క్రియేట్ చేయవు. స్టాటిక్స్ అంటే ఏంటంటే, ఇవి మీ జుట్టుని చిందరవందరగా చేస్తాయి. చెక్క దువ్వెనతో ఆ ప్రాబ్లమ్ ఉండదు. స్టాటిక్ లేకుండా ఉంటుంది. దీంతో జుట్టు సమస్యలు తగ్గుతాయి. అయితే, చెక్క దువ్వెనలన్నీ ఒకటి కాదు. ఇందులోనూ రకాలు ఉంటాయి. దీనికోసం మీరు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత కొనడం మంచిది. జుట్టుకోసం వేపతో తయారు చేసిన చెక్క దువ్వెన మంచిది. ఎందుకంటే వేపలోని ఎన్నో గుణాలు జుట్టు సమస్యల్ని దూరం చేస్తాయి. చుండ్రు, జుట్టు రాలడం, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి వాటిని దూరం చేసి జుట్టుని ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. కాబట్టి, జుట్టుకి వేపతో తయారైన దువ్వెనని సెలక్ట్ చేసుకోండి.


చెక్క దువ్వెనలతో లాభాలు


ముఖ్యంగా చెప్పాలంటే పర్యావరణ అనుకూలమైనది. వేప చెక్క ఏ విషపూరిత పదార్థాలతో పర్యావరణాన్ని కలుషితం చేయవు.


వీటిని వాడితే తలపై నుండి సహజ నూనెలు జుట్టు చివర్ల వరకూ వ్యాపించి జుట్టు మెరుస్తుంది.


తలపై ఎలాంటి చికాకు లేకుండా రక్తప్రవాహాన్ని పెంచుతాయి. జుట్టు కుదుళ్ళకి అవసరమైనపోషకాలు అందుతాయి.


దీనిని వాడడం వల్ల తలపై చర్మం శుభ్రంగా ఉంటుంది. చెక్క దువ్వెనలతో దువ్వితే జుట్టుకి స్పా చేసినటువంటి బెనిఫిట్స్ అందుతాయి. వీటిని ఎంకరేజ్ చేస్తే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ అనుకూల ప్రోడక్ట్స్‌ని ఎంకేజ్ అయినట్లుగా ఉంటుంది.


ముఖ్యంగా వేప చెక్క దువ్వెన యొక్క మృదువైన దంతాలు తలపై చర్మ ఆరోగ్యాన్ని కాపాడి జుట్టు కుదుళ్ళకి రక్తప్రవాహాన్ని పెంచి జుట్టు సమస్యల్ని దూరం చేస్తాయి.


అంతేకాకుండా జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకూ సహజ నూనెలు పంపిణీ చేస్తాయి. జుట్టుని మాయిశ్చర్‌గా కండీషనింగ్ చేస్తాయి. దీంతో డ్రైగా మారవు. చిట్లిపోకుండా ఉంటాయి.


గోరువెచ్చని నీటిలో


ముందుగా దువ్వెనని గోరువెచ్చని నీటిలో కొద్దిసేపు నానబెట్టండి. తర్వాత అందులోనే కొద్దిగా సబ్బు లేదా, షాంపూ కలపండి. అలానే ఉన్న తర్వాత కాసేపటికి దువ్వెనలని బయటికి తీసుకి సున్నితమైన బ్రష్‌తో రుద్దండి. తర్వాత శుభ్రమైన నీరు పోసి కడిగి చక్కగా పొడి గుడ్డతో క్లీన్ చేయండి. ఇలా రెగ్యులర్‌గా కనీసం రెండు నెలలకి ఓసారైనా చేయడం మంచిది. దీంతో దువ్వెనలో మురికి పేరుకుపోకుండా ఉంటుంది.


క్లీన్ చేసేటప్పుడు


దువ్వెనని మరీ ఎక్కువగా నీటిలో నానబెట్టొద్దు. దీని వల్ల చెక్క పగిలే అవకాశం ఉంది. అదే విధంగా వాటిని మరీ ఎక్కువగా గట్టిగా రాయొద్దు. మెత్తని బ్రష్‌తో మాత్రమే దుమ్ము, ధూళిని క్లీన్ చేయండి. దీంతో పండ్ల మధ్య ఉన్న జిడ్డు పోయేలా రాయండి. మైల్డ్ షాంపూ , బేకింగ్ సోడా, వెనిగర్ వంటివి రాయొచ్చు. వీటి వల్ల మురికి, జిడ్డు త్వరగా వదిలిపోతాయి. చెక్క దువ్వెనలతో కేవలం జుట్టుని మాత్రమే క్లీన్ చేయరు కదా, వీటిని కొంతమంది గడ్డంని కూడా దువ్వుతారు. దీంతో గడ్డం పెరుగుతుందని నమ్ముతారు. తలపై జుట్టుకంటే గడ్డంలోని జుట్టుకి కాస్తా దుమ్ము ఎక్కువగా ఉంటుంది. వీటిని దూరం చేయడానికి కూడా బేకింగ్ సోడా, వెనిగర్‌లు హెల్ప్ చేస్తాయి.


జుట్టుకి చెక్క దువ్వెనతో కలిగే లాభాలు


వాడే ముందు


క్లీన్ చేసిన దువ్వెనని తిరిగి వాడే ముందు అవి పూర్తిగా ఆరిన తర్వాతే వాడాలి.


ఆరాక కూడా దానికి రెండు వైపులా ఏదైనా ఆయిల్ తీసుకుని రాయాలి. కొబ్బరినూనె, జోజోబా ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏదైనా సరే తీసుకుని అందులో క్లాత్‌ని ముంచి దాంతో దువ్వెనని రాయండి. తర్వాత ఎక్స్‌ట్రాగా ఉన్న ఆయిల్‌ని పొడి క్లాత్‌తో తుడిచి ఆ తర్వాత రాయండి.ఇలా మెంటెయిన్ చేస్తే ఎన్ని రోజులైనా చెక్క దువ్వెనలు చెక్కు చెదరకుండా మళ్ళీ మళ్ళీ వాడేందుకు హెల్ప్ చేస్తాయి. వీటితో బెనిఫిట్స్ అలానే ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa