ఇతరులు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబుకు మొదటి నుంచీ ఆలవాటేనని, ఓటు చోరీ తరహాలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడూతు... అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని.. అది ఎవరి హయాంలో జరిగినా... అంతా నా వల్లే అనడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. వైయస్.జగన్ హయాంలోనే డేటా సెంటర్ కి శ్రీకారం చుట్టామన్న ఆయన.. కేవలం డేటా సెంటర్ వల్ల గరిష్టంగా ఉద్యోగాలు రావన్న ఉద్దేశ్యంతో వాటికి అనుబంధంగా ఐటీ పరిశ్రమలు కూడా ఏర్పాటుచేయాలన్న షరతులు కూడా విధించామన్నారు. టీడీపీ, చంద్రబాబు కంటే ముందు కూడా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గుర్తించుకోవాలని సూచించారు. అయన మాట్లాడుతూ.... ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు, తాను ముఖ్యమంత్రి కాకముందు ఎలాంటి అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని మర్చిపోయి ఎక్కడ, ఏం జరిగినా అది నేను, నా వల్లే అన్న అంటూ.. తాను ఏర్పాటు చేసుకున్న నారావారి మీడియాతో ప్రమోటే చేసుకోవడం చంద్రబాబుకు అలావాటుగా మారింది. విశాఖలో డేటా సెంటర్ గురించి మాట్లాడుతూ.. దాన్ని ఎప్పుడు మెటీరియలైజ్ చేశారు, జీవో ఎప్పుడు ఇచ్చారన్నది కూడా తెలుసుకోకుండా, గతంలో ఏం జరిగిందన్నది ప్రస్తావించకుండా అంతా నా వల్లే అన్న రీతిలో మాట్లాడుతున్నారు. 1992లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారు. అది నేను కట్టానని చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చాడు. 2004 తర్వాత హైదరాబాద్ ఎంత అభివృద్ది చెందిందీ.. రాజశేఖర్ రెడ్డితో పాటు మిగిలిన నేతలు ఏ స్ధాయిలో అభివృద్ధి చేశారన్నది ఆయన ఏ రోజూ ఆలోచన చేయడు.అభివృద్ది అనేది ఓ నిరంతర ప్రక్రియ. 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, దామోదర సంజీవయ్య వంటి గొప్ప వ్యక్తులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ టైంలో వ్యవసాయం ప్రధానం. వాళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా మేమేం అంతా చేశామని చెప్పుకున్న పరిస్థితి లేదు. వాళ్ల హయాంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యధిక ఆహార ధాన్యాల ఉత్పత్తితో అన్నపూర్ణగా ఖ్యాతిపొందింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత, చేవెళ్ల, నెట్టెంపాడు ప్రాజెక్టులు తెలంగాణాలోనూ, ఏపీలో పోలవరం ప్రాజెక్టకు అన్ని అనుమతిలు తీసుకువచ్చారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, అవుటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే వంటివి వైయస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. ఐటీని కూడా బూమ్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మా నాన్న మైక్రోసాఫ్ట్ తెచ్చాడు. నేను గూగుల్ తెచ్చానని లోకేష్ మాట్లాడుతున్నాడు. ఐటీలో కర్ణాటక రాజధాని బెంగుళూరు కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. వాస్తవానికి కర్ణాటకలో ఎస్ ఎస్ కృష్ణగారు, ఏపీలో చంద్రబాబు గారు ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన నావల్లే బెంగుళూరుకు ఐటీకి వచ్చిందని చెప్పలేదు. ఇవాళ ఐటీ ఎక్స్ పోర్ట్స్ 210 బిలియన్ డాలర్లు ఉంటే అందులో బెంగుళూరు వాటా 80 బిలియన్ డాలర్లు అంటే 40 శాతం వాటా అంటే దాదారు రూ.7లక్షల కోట్లు వస్తుంది. తర్వాత హైదరాబాద్ రూ.1.3లక్షల కోట్లు ఉంది. ఎంత తేడా ఉంది. కానీ అక్కడ ఏ నాయకుడు మేమే ఐటీకి ఆద్యులనమి మాట్లాడలేదు. ఆ తర్వాత స్ధానాల్లో పుణే, చెన్నై, ముంబాయి, గుర్ గావ్ ఉన్నాయి. మరి హైదరాబాద్ కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ చేసిన చోట్ల అక్కడ నాయకులు చంద్రబాబులా నేనే అని చెప్పుకోలేదన్న సంగతి తెలుసుకోవాలి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa