కరేబియన్ సముద్రంలో కలకలం రేగింది. అమెరికా తీరం వైపు భారీగా మాదకద్రవ్యాలతో వస్తున్న ఓ సెమీ-సబ్‌మెర్సిబుల్ నౌకను అమెరికా సైన్యం బాంబులతో పేల్చివేసింది. అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు కీలక మార్గంగా ఉన్న ఈ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లు అక్కడికక్కడే మరణించారు. ఈ దాడి ద్వారా సుమారు 25,000 మంది అమెరికన్ల ప్రాణాలను కాపాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఘటనపై తన అధికారిక సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ట్రంప్ స్పందించారు. "అమెరికాలోకి ప్రాణాంతకమైన ఫెంటానిల్, ఇతర మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్న భారీ సబ్‌మెరైన్‌ను మన సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ నాకు ఎంతో గర్వకారణం. ఒకవేళ ఈ నౌక మన తీరానికి చేరి ఉంటే దాదాపు 25,000 మంది అమాయక అమెరికన్లు ప్రాణాలు కోల్పోయేవారు. ఈ దాడిలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు" అని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa