ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ఏఐ, భారతీయ యూజర్లకు ఒక శుభవార్త ప్రకటించింది. తన అడ్వాన్స్‌డ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అయిన 'చాట్‌జీపీటీ గో'ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక ప్రమోషనల్ పీరియడ్‌లో సైన్ అప్ చేసే యూజర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.బెంగళూరులో నవంబర్ 4న నిర్వహించనున్న తమ తొలి 'డెవ్‌డే ఎక్స్ఛేంజ్' ఈవెంట్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓపెన్ఏఐ పేర్కొంది. భారత్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చే వ్యూహంలో భాగంగా దేశంలో ఏఐ టూల్స్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రభుత్వ 'ఇండియాఏఐ మిషన్'కు మద్దతుగా కూడా ఈ చర్య దోహదపడుతుందని అభిప్రాయపడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa