ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ క్రాప్ నమోదు గడువును మరోసారి పెంచింది. ఈ క్రాప్ నమోదు గడువు నవంబర్ 12 వరకూ పొడిగించారు. ఈ క్రాప్ నమోదు గడువు పొడిగించడం ఇది రెండోసారి. రాష్ట్రంలోని రైతులు పూర్తి స్థాయిలో ఈ క్రాప్ నమోదు చేసుకోకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రైతులు తప్పకుండా తమ పంటలను ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. లేకపోతే ప్రభుత్వం అందించే రాయితీలు, సంక్షేమ కార్యక్రమాల లబ్ధి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ క్రాప్ నమోదుకు నవంబర్ 12వ తేదీ వరకూ గడువు ఉంది. అయితే నవంబర్ 8వ తేదీ నాటికే రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
నవంబర్ 9 నుంచి నవంబర్ 12వ తేదీ వరకూ ఈ క్రాప్ నమోదు చేసుకున్న రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాలలో ప్రదర్శిస్తారు. ఈ క్రాప్ నమోదులో రైతులకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని అధికారులు సూచించారు. రైతుల నుంచి వినతులను స్వీకరించి..వాటిని పరిష్కరించిన అనంతరం నవంబర్ 13న తుది జాబితాను ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
మరోవైపు పంటల సేకరణ, ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం సంభవించిన సమయంలో పంటలకు బీమా ప్రయోజనం అందించేందుకు ఈ క్రాప్‌ను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. అలాగే రైతులకు పెట్టుబడి సాయం అందించే సమయంలోనూ ఈ క్రాప్ వివరాలు కీలకంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో పంటలు సాగు చేసిన రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలు, అర్హులకు మాత్రమే చేరుతాయని.. పంటలు సాగుచేయకుండా కూడా లబ్ధి పొందే వారికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం ఉద్దేశం. ఈ నేపథ్యంలో రైతులందరితో పూర్తిస్థాయిలో ఈ క్రాప్ నమోదు చేయించాలని అధికారులకు స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa