గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయనకు కర్నాటక లా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్.. నేడు గవర్నర్‌గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారని వైయస్ జగన్ ట్వీట్ చేశారు. ‘‘చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్‌లో వైయస్ జగన్ పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa