తిరుమల కొండకు వెళ్లే భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెండో ఘాట్ రోడ్డులో ఓ భారీ కొండచిలువ కనిపించడంతో భయాందోళనలకు గురయ్యారు. మొన్న రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల్లోకి వెళ్తే.. మొన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో కొందరు భక్తులు కారులో తిరుమలకు వెళ్తున్నారు. రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం దాటిన తర్వాత రోడ్డు పక్కన ఓ భారీ కొండచిలువ నెమ్మదిగా కదులుతూ కనిపించింది. దాన్ని చూసిన భక్తులు వెంటనే తమ వాహనాన్ని ఆపి, ఫోన్‌లో వీడియో తీశారు.అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa