AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ బలపడనుందని APSDMA తెలిపింది. పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 58 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ. వేగంతో కదులుతూ దూసుకొస్తోంది. ఆదివారం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు దక్షిణ కోస్తా, రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ప్రభావంతో రేపు, ఎల్లుండి కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa