కర్ణాటకలోని హుబ్బళ్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వద్దన్నా వినకుండా కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో ఓ తండ్రి తన కూతురినే హత్య చేశాడు. గర్భవతి అని కూడా చూడకుండా బంధువులతో కలిసి ఇనుపరాడ్లతో దారుణంగా కొట్టి చంపాడు. అడ్డుకున్న కూతురు అత్త, ఆడపడుచులపైనా దాడి చేశాడు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు..హుబ్బళ్లి జిల్లాకు చెందిన 19 ఏళ్ల మన్య పాటిల్ వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. కుటుంబ సభ్యులను ఎదిరించి ఈ ఏడాది మే నెలలో వివాహం చేసుకుంది. తండ్రి ప్రకాశ్ ఫక్రిగోడాకు భయపడి ఆ జంట స్వగ్రామానికి దూరంగా నివసిస్తోంది. అయితే, మన్య గర్భం దాల్చడంతో ఈ నెల 8న భార్యాభర్తలు ఇద్దరూ సొంతూరుకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం పొలంలో పనిచేస్తున్న మన్య భర్త, మామలపై ఆమె తండ్రి ప్రకాశ్ దాడి చేశాడు.బంధువులతో కలిసి దాడికి వచ్చిన ప్రకాశ్ నుంచి ఆ తండ్రీకొడుకులు తప్పించుకున్నారు. తిరిగి సాయంత్రం ప్రకాశ్, మరో ముగ్గురు బంధువులతో కలిసి మన్య అత్తగారింటికి వెళ్లాడు. ఇంట్లోకి చొరబడి మన్యపై ఇనుప రాడ్లతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన మన్య అత్త, ఆడపడుచును కూడా కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మన్య.. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. తీవ్రంగా గాయపడ్డ మన్య అత్త, ఆడపడుచు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మన్య భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa