ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను కలుపుతూ మరో కొత్త రైలు సేవ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ రైలు గుంటకల్లుతో మార్కాపురం రోడ్ స్టేషన్ను కలుపుతూ ప్రయాణించనుంది.దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ వివరాలను తాజాగా వెల్లడించారు. స్థానిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైలు ప్రారంభానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైలు నంద్యాల రూట్ మీదుగా ప్రయాణిస్తుంది.రైలు నం.57407/57408 గుంతకల్లు - మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. రైలు నం.57407 గుంతకల్లుతో సాయంత్రం 5.30కి బయలుదేరి, రాత్రి 11.30కి మార్కాపూర్ రోడ్ చేరుతుంది. ఈ రైలు నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది.అలాగే రైలు నం.57408 మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కి బయలుదేరి, సాయంత్రం 4.30కి గుంతకల్లుకు చేరుతుంది. ఈ రైలు నంద్యాలలో ఉదయం 7.20కి ఆగుతుంది.రైలు మార్గ మధ్య మద్దికెర, పెండేకల్లు, ధోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల, కృష్ణాపురం, కంబం, తర్లుపాడు స్టేషన్లలో ఆగుతుంది.ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా గుంతకల్లు-మార్కాపూర్ రోడ్ మధ్య ప్రయాణించే వారికి మాత్రమే కాకుండా, మార్గ మధ్యని నంద్యాల, గిద్దలూరు, కంభం ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. రైలు విద్యార్థులు, వ్యాపారస్తులు మరియు సాధారణ ప్రయాణికులు తక్కువ ఛార్జీతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa