ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనవరి 18 నుంచి ఫిబ్రవరి 3 వరకు,,,,కేరళలో కుంభమేళా

national |  Suryaa Desk  | Published : Mon, Dec 29, 2025, 08:44 PM

ఉత్తర భారతదేశంలో అత్యంత వైభవంగా జరిగే కుంభమేళా తరహాలోనే.. ఇప్పుడు కేరళలో కూడా కేరళ కుంభమేళా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. జగద్గురు శంకరాచార్యులు జన్మించిన ఈ పవిత్ర భూమిలో.. చరిత్రలో తొలిసారిగా ఈ భారీ ఆధ్యాత్మిక వేడుక జరగబోతోంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యక్షేత్రాలలో జరిగే కుంభమేళా తరహాలోనే.. కేరళలో కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని జునా అఖారా (దేశంలోనే అతిపెద్ద సన్యాసుల విభాగం) నిర్ణయించింది.


2026 జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు.. కేరళ మలప్పురం జిల్లాలోని భారతపుళ నదీ తీరంలో.. ప్రసిద్ధ తిరునావాయ నవ ముకుంద ఆలయం ముందు ఈ కుంభమేళా వేడుకలను జరపనున్నారు.


చారిత్రక నేపథ్యం - మహామఖం


జునా అఖారా మహామండలేశ్వర్ స్వామి ఆనందవనం భారతి తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు కుంభమేళా వంటి గొప్ప సంప్రదాయం గతంలోనే ఉందని పేర్కొన్నారు. పూర్వం చేరమాన్ పెరుమాళ్ రాజుల కాలంలో తిరునావాయలో మహామఖం అనే ఉత్సవం జరిగేదని.. ఇది ఉత్తర భారత కుంభమేళాకు సమానమైనదని ఆయన వెల్లడించారు.


అప్పట్లో ఈ మహామఖం ఉత్సవం ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగేదని.. అందులో పండితులు, రాజులు, యోధులు పాల్గొని సనాతన ధర్మం గురించి చర్చించేవారని ఆనందవనం భారతి తెలిపారు. చివరిగా ఈ సంప్రదాయాన్ని 2016లో పునరుద్ధరించే ప్రయత్నం మొదలైందని చెప్పారు.


కుంభమేళా నిర్వహణ, ఏర్పాట్లు


దేశవ్యాప్తంగా జరిగే కుంభమేళాలను పర్యవేక్షించే జునా అఖారా ఈ వేడుకను కేరళలో నిర్వహిస్తోంది. కేరళలోని అన్ని ఆశ్రమాలు, మఠాధిపతులు ఇందులో భాగస్వాములు అవుతారు. ఈ వేడుకను విజయవంతం చేయడానికి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, మలబార్ దేవస్వం బోర్డుల సహకారాన్ని జునా అఖారా కోరనుంది.


2026లో ప్రారంభమయ్యే ఈ కుంభమేళా వేడుకను.. 2038 నాటికి ( తర్వాత 12 ఏళ్ల చక్రం పూర్తి అయ్యే సమయానికి) మరింత భారీ స్థాయిలో నిర్వహించాలని జునా అఖారా లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులోని కుంభకోణంలో కూడా ఇలాంటి మహామఖం వేడుక జరుగుతుందని.. మఖం నక్షత్రం ప్రాముఖ్యతతో ఈ ఉత్సవాలు ముడిపడి ఉన్నాయని ఆనందవనం భారతి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa