ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రతతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఈ పొగమంచు కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హర్యానాలోని సోనిపట్ జిల్లాలో బహల్‌గఢ్ సమీపంలో ఢిల్లీ-సోనిపట్ రహదారిపై పలు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa