మిల్లేట్స్ చాలా మంచివి. వీటిని మన డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అధిక బరువు తగ్గడం దగ్గర్నుంచీ ఎన్నో ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. అలాంటి వాటిలో షుగర్ కూడా ఒకటి. షుగర్ వచ్చిందంటే చాలు డైట్, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. షుగర్ ఉన్నవారు వారి డైట్‌లో కొన్ని తృణధాన్యాలని చేర్చడం చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాలు ఉంటాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక్కో లాభాన్ని అందిస్తాయి. అవేంటి వాటిని ఎలా తీసుకోవాలో, తీసుకుంటే కలిగే లాభాలేంటో చెబుతున్నారు డాక్టర్ దీక్షా భావ్‌సర్.
బార్లీతో షుగర్, ఫ్యాట్ రెండూ తగ్గుతాయ్
బార్లీ తీసుకోవడం వల్ల మన బాడీలో అధిక కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ రెండూ తగ్గుతాయి. అంతేకాకుండా, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీంతోపాటు కఫా కూడా తగ్గుతుంది. షుగర్, అధికబరువు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ బార్లీ మంచివి. వీటిని మనం ఓ లీటర్ నీటిలో వేడి చేసుకుని తాగడం మంచిది. లేదా బార్లీ రోటీ, రైస్‌లా చేసుకుని అన్నం బదులు తినడం కూడా మంచిది.
రాగులు కూడా మంచివే
రాగుల్లో కాల్షియం, ఐరన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గ్లూకోజ్‌ని మెల్లిగా రిలీజ్ చేస్తాయి. ఎముకలు, కండరాలని బలంగా చేస్తాయి. ఇవి షుగర్ ఉన్నవారికి, వయసు పెరిగే వారికి, మహిళలకి చాలా మంచివి. వీటిని మనం రాగి రోటి, దోశ, జావలా ఎలా అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా పోషకాలన్నీ శరీరానికి అందుతాయి.
సజ్జలతో ఆరోగ్యం
అదే విధంగా, సజ్జలు కూడా చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. వీటిని తిన్న చాలాసేపటి వరకూ కడుపు నిండుగా ఉంటుంది. షుగర్, అధిక బరువు ఉన్నవారితో పాటు జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా చాలా మంచిది. వీటిని రోటీలా చేసుకుని తీసుకోవడం మంచిది. అంతేకాకుండా, పెసరపప్పుతో కలిపి కిచిడీలా చేసి తినడం మంచిది. జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎండాకాలంలో తినకపోవడమే మంచిది.
ఊదలు కూడా ఆరోగ్యానికి మంచివి
ఊదలు చాలా లైట్‌గా ఉంటాయి. త్వరగా జీర్ణమవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల తిన్న తర్వాత పెరిగే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఉపవాసం సమయంలో ఊదల్ని తింటే బాడీ డీటాక్స్ అవుతుంది. వీటిని ఆహారం తీసుకున్న తర్వాత తినడం మంచిది. కిచిడి, ఇడ్లీ, దోశల్లా చేసుకుని తినడం మంచిది.
జొన్నలతో మేలెంతో
జొన్నలు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఫ్యాట్, షుగర్ మెటబాలిజం తగ్గుతుంది. అధికబరువు, డయాబెటిస్, ప్రీ డయాబెటిస్, పీసీఓఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారికి ఇవి చాలా మంచివి. వీటిని మీరు జొన్న రొట్టె, బక్రి, నానబెట్టి దోశల్లా చేయడం, పెసరపప్పుతో కలిపి కిచిడీలా చేసుకుని తినడం మంచిది. వీటిని తీసుకునే ముందు 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టాలి. వీటిని నానబెట్టినప్పుడు కొద్దిగా నెయ్యి కలిపితే డ్రైనెస్ తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రుళ్ళు తినకపోవడమే మంచిది.
షుగర్ ఉన్నవారు తినాల్సిన మిల్లెట్స్
కొర్రలతో ఎన్నో లాభాలు
కొర్రల్లో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కఫా, బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. గట్ హెల్త్ మెరుగ్గా మారుతుంది. ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి, పీసిఓఎస్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో బాధపడేవారికి కొర్రలు మేలు చేస్తాయి. వీటిని మనం ఉప్మా, పులావ్‌లా చేసి తీసుకోవచ్చు. అన్నం బదులు కూడా తినొచ్చు.
మిల్లేట్స్ తీసుకునేముందు పాటించాల్సిన జాగ్రత్తలు
వీటిని ఎప్పుడైనా కూడా తీసుకునే ముందు 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి. నెయ్యి, కూరగాయలు, ప్రోటీన్‌తో కలిపి తీసుకోవాలి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే రాత్రుళ్ళు తీసుకోవద్దు. మిల్లేట్స్‌ని తీసుకునేటప్పుడు పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa