వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా బలగాలు బలవంతంగా అరెస్ట్ చేసి ఫ్లోరిడాకు తరలించిన విషయం తెలిసిందే. దీంతో వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలను తాత్కాలికంగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు డెల్సి రోడ్రిగ్జ్ చేపట్టారు. ఆమె 90 రోజుల పాటు అధికారంలో ఉంటారని వెనెజువెలా రక్షణమంత్రి వెల్లడించారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలా అధ్యక్షుడిని తానేనని ట్రూత్ సోషల్ లో ఓ పోస్టు పెట్టారు. వికీపీడియాను పోలిన ఎడిటెడ్ ఫొటోను ఆయన పంచుకున్నారు. ఈ ఫొటోలో డొనాల్డ్ ట్రంప్ ను వెనెజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ గా చూపించారు. ట్రంప్ ఫొటో కింద ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లుగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa