స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో కీలకమయ్యాయి, అయితే వాటిని శుభ్రంగా ఉంచుకోకపోతే కరోనా వైరస్ వంటి సూక్ష్మక్రిములు చేరతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను సురక్షితంగా, జర్మ్‌ఫ్రీగా శుభ్రం చేయడానికి, ముందుగా స్విచ్ ఆఫ్ చేసి, మైక్రోఫైబర్ క్లాత్‌తో నెమ్మదిగా తుడవాలి. 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ద్రావణాన్ని క్లాత్‌పై కొద్దిగా వేసి స్క్రీన్‌ను శుభ్రం చేయాలి. పోర్ట్స్, స్పీకర్ గ్రిల్స్‌లో నీరు పోకుండా జాగ్రత్త వహించాలి. ఫోన్ కవర్‌ను సబ్బు నీటితో కడగాలి. రోజుకు కనీసం ఒక్కసారైనా ఫోన్‌ను తుడవడం అలవాటు చేసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa