అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్‌కు 4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.36 వేల కోట్లు) విలువైన 30 అత్యాధునిక అపాచీ హెలికాప్టర్లను అందించే ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ భారీ ఆయుధ ప్యాకేజీలో భాగంగా 1.8 బిలియన్ డాలర్ల విలువైన 'జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్స్' కూడా ఉన్నాయి. గాజాలో కాల్పుల విరమణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఇజ్రాయెల్ తన ఆత్మరక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని యుఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa