ప్రతిపక్షాల తమ లోపాలకు ఇవిఎంలను నిందిస్తున్నాయని, ఇవిఎంలను నిందించడమెందుకని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా రాజ్యసభలో మోడీ మాట్లాడారు. ప్రతిపక్షాలకు తమతో పోరాడే సత్తా లేదని ఆయన అన్నారు. ఈ ఇవిఎంలతో 113 అసెంబ్లిd, 4 సాధారణ ఎన్నికలు జరిగాయని ఆయన చెప్పారు. ఇవిఎంలను నిందించడం ఒక జబ్బు అని ఆయన అన్నారు. ఎన్నికల సంస్కరణలు కొనసాగించాల్సిందేనన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే దేశ ఓటర్లు ఓడిపోయినట్లు కాదని ఆయన చెప్పారు. ఓటమిని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోందని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa