సంగీత దర్శకుడు వోగేటి నాగ వెంకట రమణమూర్తి 63 గంటల పాటు స్వరార్చన చేసి గిన్నిస్ రికార్డు సృష్టించాలని నిర్ణయించారు. మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని లండన్ వేదికగా ఈ ప్రయత్నం చేయనున్నారు. లండన్ వెస్ట్ కెన్సింగ్‌టన్ లోని ద భవన్ లో ఈ నెల 30న ఉదయం 5 గంటలకు ప్రారంభమై అక్టోబరు 2న రాత్రి 9 గంటలకు ఈ ప్రదర్శన ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa