గుంటూరు జిల్లా, మంగళగిరి మండలంలోని నీరుకొండ గ్రామంలో అక్రమంగా కొండ మట్టిని త్రవ్వి తరలిస్తున్న 3 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. 15 రోజుల వ్యవధిలో 7 మట్టి, గ్రావెల్ ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు చెప్పారు. కొండమట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేయగా నిర్వాహకులు పారిపోగా, అక్కడ ఉన్న ట్రాక్టర్ లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa