ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ పాలసీ సలహాదారుగా సీనియర్ జర్నలిస్టు కే రామచంద్రమూర్తి నియామకమయ్యారు. రామచంద్ర మూర్తిని ప్రభుత్వం పబ్లిక్ పాలసీ సలహాదారుగా నియమించింది. ఆయన నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ పగ్గాలు చేపట్టాక ఈ నాలుగు నెలల్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సలహాదారులు నియమితుల య్యారు. వీరందరికీ కేబినెట్ ర్యాంకు.. భారీ జీతభత్యాలు కల్పించారు. ముఖ్యమంత్రికి ఆరుగురు సలహాదారులుగా ఉండగా మరికొందరు వివిధ శాఖల్లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa