హిందూ ధార్మిక సంస్థలు, ట్రస్టుల చట్టం ప్రకారం పాలకమండళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని 25 దేవాలయాలకు పాలక మండళ్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అనుమతించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.కోటి-రూ.5 కోట్ల మధ్య వార్షికాదాయం ఉన్న అన్ని ఆలయాలకు పాలకమండలి ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీకాకుళం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, అంతర్వేది, అమరావతి, పాలకొల్లు సహా పలు ఆలయాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa