ఎలాగైనా చంద్రబాబును జైలుకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనిఅన్నారు అనంత పురం మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి. సోమవారం ఆయన రాష్ట్రంలో, కేంద్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ...వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చంద్రబాబును ఏం చేసైనా జైలుకు పంపేయాలని ప్రయత్నిస్తోందని.. ఆ క్రమంలోనే అనేక ఆరోపణలు చేస్తూ, కమిటీలంటూ రచ్చ చేస్తోందని చెప్పుకొచ్చారు.‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు కచ్చితంగా జరుగుతున్నాయి.. నగ్న సత్యం. కానీ బీజేపీ నుంచి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయో లేదో చెప్పలేనని.. వాళ్ల నుంచి కూడా ఉండొచ్చని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు జెసి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa