పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై ప్రముఖ సినీ నటుడు, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాకూడదని హితవు పలికారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఆందోళనలు తనను ఎంతో వేదనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనేందుకు హింస, అల్లర్లు మార్గం కాకూడదని సూచించారు. భారతీయులంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa