మేషం: ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకువేస్తారు. ఆటోమొబైల్, రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. రిప్రజెంటివ్‌లకు పురోభివృద్ధి. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి లోనవుతారు. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు.
వృషభం:రాజకీయనాయకులు సభా, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రైవేట్ సంస్థలలోని వారికి సంతృప్తికానవస్తుంది. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఇతురల కారణంగా మీ పనులు వాయిదా పడతాయి.
మిథునం: సన్నిహితులతో మీ ఆర్థిక విషయాలను గురించి చర్చించవద్దు. కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే కలహాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల దృష్ట్యా తరచూ ప్రయాణాలు చేయవలసివస్తుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులు అనుకూలం.
కర్కాటకం: రుణ వ్యవహారాల్లో వచ్చే ఒత్తిడిని తెలివిగా సరిచేయగలుగుతారు. వాగ్వివాదాలకు దిగి సమస్యలు తెచ్చుకోకండి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శనగల వ్యాపారస్థులకు, స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. ఖర్చులు అధికం.
సింహం:నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. నిర్మాణ పథకాల్లో సంతృప్తి కానవస్తుంది. మీ మనోభావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తాయి. ఊహించని ఖర్చులు అధికము కావడంతో ఆందోళనకు గురవుతారు.
కన్య: బంగారం, వెండి, వస్త్ర, వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. సిమెంట్, ఐరన్ రంగాల్లో వారికి పనులు మందకొడిగా సాగుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృత్తుల్లో వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన వ్యక్తులు సన్నిహితులవుతారు.
తుల: అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. బ్యాంకు ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి కలిసివచ్చే కాలం. బంధువుల రాకపోకలు పెరుగుతాయి.
వృశ్చికం: బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ పరోపకార గుణం వలన మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యుల కోసం షాపింగ్‌లు చేస్తారు.
ధనస్సు: భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. విద్యార్థులు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత అవసరం. విద్యుత్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకరం: రాజకీయాల్లో వారికి పార్టీ వారితో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. ఆత్మీయులను విమర్శించడం వలన చికాకులను ఎదుర్కొంటారు. రుణాల విషయంలో ఊరట చెందుతారు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
కుంభం: ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యవసాయ, తోటల రంగాల వారు శాస్త్రవేత్తల సలహాలు పాటించడం శ్రేయస్కరం. విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్, లా కోర్సుల్లో అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు వస్త్రాలు, ఆభరణాలు విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మీనం: కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వైద్య, టెక్నికల్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa