మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(89; 64 బంతుల్లో 10x4, 3x6), కీరన్ పోలార్డ్(74; 51 బంతుల్లో 3x4, 7x6) ధాటిగా ఆడడంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఎవిన్ లూయిస్(21), షైహోప్(42), రాస్టన్ ఛేజ్(38), షిమ్రన్ హెట్మేయర్(37) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో నవ్‌దీప్ సైని రెండు వికెట్లు తీయగా, శార్ధుల్ ఠాకుర్, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa