తాడివారిపల్లె జడ్‌పి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేయుచున్న యస్.యం.డి రఫి కి రాష్ట్రస్థాయి గురుబ్రహ్మ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని మదర్ థెరిస్సా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం వారు అందజేశారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన పురస్కార వేడుకలో రఫికి ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ సంధర్భంగా పురస్కార గ్రహీత రఫిని పాఠశాల సిబ్బంది, గ్రామస్థులు, స్నేహితులు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa