ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు(04-06-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 04, 2020, 12:41 PM

రాశి- మేషం: ఆత్మీయుల క్షేమం ఉపశమనం కలిగి స్తుంది. ఈ రోజు అదృష్టం కలిసివచ్చే రోజు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగి పనులు పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. తోటి వారు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.


రాశి- వృషభం: పిల్లల దూకుడు అదుపుచేయండి. మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మానసికంగా దృడంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయొద్దు.


రాశి- మిధునం: కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. నూతన వస్తువులు కనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. రోజులో ఎక్కువ సమయం మీకు ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలున్నాయి.


రాశి-కర్కాటకం: శుభకాలం. అనుకున్న పనులు అవుతాయి. ఆనందవతవరణం ఉంటుంది. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. ధనలాభం కలుగుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం పనిచేస్తోంది.


రాశి- సింహం: ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. అనుకూల ఫలితాలున్నాయి. ఒకవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి.


రాశి- కన్య: పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావముతో మెలగండి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కోపావేశాలకు లోనవడం వల్ల అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.


రాశి-తుల: వ్యాపకాలు సృష్టించుకుంటారు. శుభకాలం. మీ ప్రతిభకు అధికారుల ప్రశంశలు దక్కుతాయి. మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. బందుమిత్రుల వలన ఖర్చు అధికంగా ఉంటుంది. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు.


రాశి-వృశ్చికం: పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలున్నాయి. ఈ రోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది.


రాశి- ధనస్సు: నమ్మకస్తులే తప్పు దారి పట్టించే ఆస్కారం ఉంది. మీమీ రంగాల్లో ఆటకం ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. ఒక ముఖ్య పనిలో కదలిక వస్తుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు.


రాశి- మకరం: వ్యాపకాలు సృష్టించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కలహ సూచన ఉంది. ఆదిత్య హృదయం పఠించాలి. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి.


రాశి- కుంభం: ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. శుభఫలితాలున్నాయి. కుటుంబసహకారం ఉంది. ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. ఎవరితోనూ గొడవలకు పోవద్దు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.


రాశి- మీనం: సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో ఇబ్బందుల్లో పడతారు. ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్ లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa