ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్జూరంలో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 29, 2020, 01:12 PM

ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు. దీనిని తరచుగా వాడుతూంటే, పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చేయవచ్చు.
పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే. ఇవి రెండూ ఒకే జాతికి చెందినా ఖర్జూరంలో కండ ఎక్కువగా ఉంటుంది. సామాన్యంగా దొరికే పండులోనూ అదే రుచి ఉంటుంది. కాకుంటే, ఖరీదు ఎక్కువగా ఉండే ఖర్జూరాలు మరింత మృదువుగా, అప్పుడే చెట్టునుండి తెంపినట్లుగా, కమ్మగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కావడంతో ఖర్జూరాలు అందరూ ఇష్టపడతారు.
నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం.
గుండె ఆరోగ్యానికి: గుండె కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి ఇందులోని పొటాషియం చాలా ఉపయోగపడుతుంది. రక్తపోటును నివారించే సామర్థ్యంకూడా దీనికి ఉందట. ఆల్కహాల్ లేదా ఇతర మత్తుపదార్ధాల ప్రభావం నుండి బయటపడాలంటే ఖర్జూరాలు మంచి ఔషధం. గింజతీసివేసి ఈ రసం ప్రతిరోజూ రెండు పూటలా తాగితే గుండె జబ్బులు రాకుండా కూడా చేస్తుంది.
మలబద్దకం: మలబద్దకాన్ని నివారించడానికి ఖర్జూరం ఒక దివ్వఔషదం. మలబధ్దకంతో బాధపడే వారు ఈ కర్జూరం పండ్లును రాత్రంతా నానబెట్టి, ఆ నీటితోఉదయం పరగడున తాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. కర్ఝూరంలో ప్రోటీనులు, ఫైబర్ మరియు అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ కర్జూరం నుండి మలబద్దకం సమస్య అధిగమించేందుకు బాగా సహాయపడుతుంది. రేచీకటి: కర్జూరంలో అధికంగా విటమిన్ ఎ తో పాటు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ రేచీకటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. కాబట్టి కర్జూరం నుండి ఎ విటమిన్ తీసుకోవడం చాలా అవసరం.
గర్భిణీకి: గర్భిణీలకు ఫోలిక్‌యాసిడ్‌ చాలా అవసరం. అది ఇందులో మెండుగా ఉంది. కాబట్టి గర్భణీ స్త్రీలు కర్జూరం ను తరచూ తీసుకొంటుండాలి. ముఖ్యంగా గర్భిణీలు ఖర్జూరాలు తింటే ఐరన్‌ బాగా దొరుకుతుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరాల్లో 7.3 మిగ్రా ఐరన్‌ ఉంది. ఇంకా హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలకు కూడా కర్జూరం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కర్జూరం పండులో క్యాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్, మరియు సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఈ కనిజలవణాలు, గర్భంలోని పిండి పెరుగుదలకు చాలా అవసరం. బోలు ఎముకల వ్యాధి నిరోధానికి: ఈ రోజుల్లో అనేక మంది కీళ్ళ నొప్పితో మరియు బోలు ఎముకల వ్యాధి బాధపడుతున్నారు. శరీరంలో కాల్షియం స్థాయిలు అతితక్కువగా ఉండటం చేత ఈ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి కర్జూరంలో క్యాల్షియం అధిక శాతంలో కలిగి ఉండటం చేత వీటిని తరచూ తినడం వల్ల కీళ్ళ నొప్పి చికిత్సకు సహాయపడుతుంది. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూర పండు తరచుగా ఎక్కువగా తినాలి.
పెద్ద ప్రేగు రుగ్మతలు: జీర్ణశక్తిని మెరుగుపర్చేశక్తి ఖర్జూరాల్లోని ఫైబర్‌కు వుందనేది వైద్య పరిశోధనల్లో తేలింది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. దంత క్షయం: చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. చాలా మంది దంత క్షయంతో బాధ పడుతుంటారు. కర్జూరం తినడం వల్ల దంత క్షయాన్ని మరియు డెంటల్ ప్లాక్ నిరోధించవచ్చు. ఈ పండులో ఫ్లోరిన్ అధికంగా ఉండటం వల్ల, మినరల్స్ పుష్కలంగా ఉండటం చేత ఆరోగ్యకరమైన దంత నిర్వాహనకు చాలా అవసరం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa